పేపర్ లీకేజీకి సంబంధించి టీఎస్పీఎస్సీ అతి తర్వలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. హార్టికల్చర్ అధికారుల పోస్టు పరీక్షపై ఈ రోజున కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. అదే విధంగా లీకేజీతో వాయిదా పడిన పరీక్షలపై కూడా స్పష్టత రానుంది.
అయితే ఐదు పరీక్షలను టీఎస్పీఎస్సీ తిరిగి నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు లేకపోతే రేపు తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించనుంది. ఈ పేపర్ లీకేజీల నేపథ్యంలో రెండు పరీక్షలను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను రద్దు చేయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు డివిజనల్ అకౌంట్స్ అధికారి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షలు రద్దయ్యాయి.
దాంతో పాటు కమిషన్ నిర్వహించే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇక ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని ఖరారు చేసింది. జూన్ 11న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వాయిదా పడిన వాటితో పాటు రద్దైన పరీక్షలకు నేడో, రేపో తేదీలను టీఎస్పీఎస్సీ వెల్లడించనుంది. అయితే వీటిలో కొన్ని పోస్టుల రాత పరీక్షను గతంలో ఓఎంఆర్ పద్ధతిలో టీఎస్పీఎస్సీ నిర్వహించింది.
అయితే ఈ సారి ఈ ఎగ్జామ్స్ ను ఆన్ లైన్లో నిర్వహించాలని అధికారులు భావిస్తుంది. ఏయే పరీక్షలు ఆన్ లైన్లో నిర్వహించబోతున్నారనేది దానిపై కూడా క్లారిటీ రానుంది. దీంతో పాటు కొన్ని పరీక్షలను ఓఎంఆర్ పాత పద్ధతిలోనే నిర్వహించాలని కూడా టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఇక హార్టికల్చర్ పరీక్షకు సంబంధించి హాల్ టిక్కెట్లు ఈ రోజు వెబ్ సైట్లో రావాల్సి ఉంది. 22 హార్టి కల్చర్ అధికారుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే పేపర్ లీకేజీ నేపథ్యంలో ఈ పరీక్షలను మరింత పటిష్టం నిర్వహించాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ పై ఉంది.