వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతున్న టీఎస్ పీఎస్సీ.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నియామకాల ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం మరింత ముమ్మరం చేస్తోంది.
5,204 పోస్టులకు స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అలాగే 1365 పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం గ్రూప్-3 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్ పీఎస్సీ పేర్కొంది.
అయితే పరీక్ష తేదీలను మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల కాగా.. గ్రూప్-2 నోటిఫికేషన్ గురువారం రిలీజ్ అయింది.