తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిష పేపర్ లీకేజ్ కేసులో విచారణ చేస్తున్న సిట్ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అధికారులు నిందితులకు కఠిన శిక్ష విధించేందుకు వీలుగా ముందుకు కదులుతున్నారు.
ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 9 మందిని 6 రోజుల పాటు సిట్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది.
చంచల్ గూడా జైలులో ఉన్న నిందితులను అక్కడి నుండి తమ కస్టడీలోకి సిట్ అధికారులు తీసుకోనున్నారు. నిందితులను ఆరు రోజుల పాటు విచారించునున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారం లో నిందితుల ఆర్థిక లావాదేవీల ఫై కూపి లాగనున్న సిట్. ప్రశ్న పత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఏ -1 ప్రవీణ్ కుమార్, ఏ -2 అట్ల రాజశేఖర్, ఏ -3 రేణుక రాథోడ్, ఏ -4 డాక్య, ఏ- 5 కేతావత్ రాజేశ్వర్, ఏ -6 కేతావత్ నీలేష్ నాయక్, ఏ -7 పత్లావత్ గోపాల్, నాయక్, ఏ -8 కేతావత్ శ్రీనివాస్, ఏ -9 కేతావత్ రాజేంద్ర నాయక్ లను నిందితులుగా ఉన్నారు.