టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నాల్గో రోజు 9 మంది నిందితులను విచారిస్తోంది. గ్రూప్ 1 పేపర్ ను ఇంకెవరెవరికి ఇచ్చారనేదానిపై ఆరాదీస్తుంది. విదేశాల నుంచి రప్పించి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినట్లు గుర్తించిన సిట్..వారి వివరాలను సేకరిస్తోంది. అలాగే ఎగ్జామ్ లో 100 కు పైగా మార్కులు వచ్చిన వారి లిస్ట్ ను సిట్ రెడీ చేసింది.
నిందితురాలు రేణుక ప్రవీణ్ కు తెలియకుండా మరి కొంతమందికి ఏఈ పేపర్ అమ్మినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్ సీ పేపర్ తీసుకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టనుంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ స్వగ్రామానికి తరలివెళ్ళింది సిట్ అధికారుల బృందం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి వెళ్ళి రాజశేఖర్ వ్యవహారంపై ఎంక్వైరీ చేస్తున్నారు.
పేపర్లు ఇంకా ఎవరెవరి చేతుల్లోకి చేరాయన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు.. స్నేహితులను ఆరా తీస్తున్నారు. పరీక్ష రాసిన రాజశేఖర్ బంధువులు ఎవరన్నదానిపై విచారిస్తోంది సిట్ బృందం. విదేశాల నుంచి పరీక్షలు రాయడం.. ఆర్థికలావాదేవీలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలో కీలకసూత్రధారి.. స్కాం స్టోరీని అత్యంత పకడ్బందీగా నడిపించిన రేణుకతో పాటు భర్త డాక్యా నాయక్ తో కలిసి ముందుగా లంగర్ హౌస్ సన్ సిటీ లోని కాళీ మందిర్ కి వెళ్లి అక్కడ అనుమానితులను విచారించింది మరో బృందం.
అటు నుంచి రేణుక సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా.. గండ్వీడ్ వెళ్లిన సిట్ టీమ్ పేపర్ లీకేజీపై మరిన్ని విషయాలను రాబట్టేందు ప్రయత్నిస్తోంది. ఇక హైదరాబాద్‌లో మరో ఏడుగురు నిందితులను సిట్ కార్యాలయానికి తరలించారు పోలీసులు. పేపర్ లీకేజ్ స్కాంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంకెవరెవరున్నారనే దానిపై విచారిస్తున్నారు సిట్ అధికారులు.