టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ లను లీకేజీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం,విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్ సీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ పేరాల, ప్రవీణ్ ఆర్య లు మాట్లాడుతూ…కేసీఆర్ కనుసన్నల్లో టీఎస్‌పీఎస్ సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామ చంద్రన్ లు అక్రమాలకు పాల్పడుతూ తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
టీఎస్‌పీఎస్‌సీ అక్రమాలకు అడ్డాగా, మారిందని,ఉద్యోగాలను భర్తీ చేయాలంటే, అమ్ముకునే స్థాయికి టీఎస్‌పీఎస్‌సీ ని కేసీఆర్ ప్రభుత్వం దిగజార్చరాని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ల పైన విచారణ జరిపించాలని, ఈ లీకేజీల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
అసమర్థ జనార్దన రెడ్డి చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పేపర్ లీకేజీ ఘటన మీద సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీజేఎస్ నాయకులు దినేష్, కల్యాణ్ తేజ, అభి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..
విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరాల ప్రశాంత్, రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ఆర్య, వీజేఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ యాదవ్, వీజేఎస్ నాయకులు దినేష్, కళ్యాణ్, అర్జున్ తదితరులును పోలీసులు అరెస్ట్ చేశారు.