ఎన్నెండ్లు ఈ నిరీక్షణ… అంటూ తొలివెలుగు టీఆర్టీ ఎస్జీటీ అభ్యర్థులకు పోస్టింగ్ పై వార్త కథనాన్ని ప్రచురించింది. రెండేళ్లు అవుతున్నా… ఇంకా పోస్టింగ్ ఇవ్వరు, అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతూ… మానసిక క్షోభకు గురవుతున్నారని వాస్తవ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఇటు అభ్యర్థులు కూడా ప్రగతిభవన్ ముట్టడించారు.
దాంతో… ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ కమీషన్ ద్వారా సమాధానం ఇచ్చింది. ఆగస్ట్ 30నే కోర్ట్ తుది తీర్పు ఇచ్చిందని, అందుకు అనుగుణంగా కమీషన్ చర్యలు చేపట్టామని తెలిపింది. అయితే… ఎవరెవరు కేసులు వేశారు, 110 కేసులకు సంభంధించిన వివరాలన్నీ క్రోడీకరిస్తున్నామని తెలిపింది. కమీషన్ తుది జాబితా ప్రకటనపై కసరత్తులు చేస్తున్నందున మరికొంత కాలం పడుతుందని… అభ్యర్థులు సహాకరించాలని తెలిపింది.
అయితే… ఇందులో కూడా ఎప్పట్లోపు పూర్తిచేస్తారో నిర్ణీత గడువు పేర్కొనకపోవటంపై అభ్యర్థులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటితుడుపు చర్యగా మాత్రమే భావిస్తున్నట్లు తెలిపారు.
టీఆర్టీ అభ్యర్థుల నిరీక్షణపై తొలివెలుగు ఏం రాసిందంటే…
http://tolivelugu.com/trt-sgt-aspirants-long-standing-waiting-for-postings/