నూతన సంవత్సరం సందర్భంగా టీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను నడుపనుంది. కొత్త సంవత్సరం కానుకగా పిల్లలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఏళ్లలోపు పిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల వెంట… 12 ఏళ్లలోపు పిల్లలు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వారికి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉచిత ప్రయాణం అన్ని బస్సులలో వర్తిస్తుందని పేర్కొన్నారు
18 సీట్ల ఏసీ బస్సులో వెళ్లి రావటానికి రూ.4 వేల ప్యాకేజీని ఆర్టీసీ ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ టూ మేడ్చల్.. సికింద్రాబాద్ టూ శామీర్ పేట.. ఉప్పల్ టూ కొండాపూర్… దిల్సుఖ్ నగర్ టూ లింగంపల్లి.. లింగంపల్లి టూ మాదాపూర్.. మెహదీపట్నం టూ శిల్పారామం.. కోటీ టూ రామోజీ.. కోటీ టూ మౌంట్ ఒపెరా… కోటీ టూ ఓషియన్ పార్క్.. లింగంపల్లి టూ ట్యాంక్ బండ్.. దిల్సుఖ్ నగర్ టూ ట్యాంక్ బండ్.. మేడ్చల్ టూ ట్యాంక్ బండ్.. మెహదీపట్నం టూ శంకర్ పల్లి.. విప్రోసర్కిల్ టూ మైత్రీవనం.. కోటీ టూ కొండాపూర్ వయా జర్నలిస్ట్ కాలనీ.. దుర్గం చెరువు.. ఐక్యా.. లింగంపల్లి టూ సికింద్రాబాద్ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయని సజ్జనార్ వెల్లడించారు.