సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దగ్గర వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. జేసీబీ సాయంతో దాన్ని బయటకు తీయాలని అధికారులు ప్రయత్నించినా ఫలించలేదు. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో బస్సు కొట్టుకుపోయింది.
సిద్దిపేట డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో గంభీరావుపేట వాగు దాటుతుండగా సోమవారం పక్కకు జారిపోయింది. బ్రిడ్జి అంచుకు వెళ్లి ఆగిపోయింది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అధికారులు బస్సును ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ.. కుదరలేదు. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో ప్రవాహానికి బస్సు ఇవాళ ఉదయం నీటిలో కొట్టుకుపోయింది.