సమ్మెలో పాల్గొన్న కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోబోమని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన విడుదల చేయటంతో… డిపోల వద్ద భారీగా పోలీసులు మోహారించారు. కార్మిక సంఘాల పిలుపుతో కార్మికులు ఉద్యోగాల్లో చేరేందుకు వస్తుండటంతో… పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్తూ… అరెస్ట్ చేస్తున్నారు.
దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తాము నోటీసులు ఇచ్చే సమ్మెకు వెళ్లామని… అంటే దాని అర్థం ఎండీ పర్మిషన్ ఉన్నట్లే కదా అని ప్రశ్నించారు. పైగా హైకోర్టు కూడా తమ సమ్మె చట్టవిరుద్ధం కాదన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం పైశాచికంగా… కార్మికులను వేధిస్తోందని, అరెస్ట్ చేసిన తమ వందలాది మంది కార్మికులను వెంటనే విడుదల చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.