సర్కారు పెట్టిన డెడ్‌లైన్‌కు 160 మంది కార్మికులు మాత్రమే స్పందించారు. వీరు విధుల్లో చేరారని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన సిబ్బంది ప్రభుత్వ బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా సమ్మెలోనే వున్నారు.
హైదరాబాద్ : సర్కారు పెట్టిన డెడ్‌టైన్ ‘సాయంత్రం 6 గంటలు’ ఆర్టీసీ కార్మికుల్ని ఏమాత్రం భయపెట్టలేకపోయింది. కేవలం 160 మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే విధుల్లో చేరినట్లు యాజమాన్యం ప్రకటించింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆఫీస్ స్టాఫ్, మెకానిక్‌లు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ సమ్మె కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మరోమారు ప్రకటించారు.