టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ పటిష్ఠ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త సదుపాయాలు, కార్యక్రమాలను అమల్లోకి తెస్తోంది. తాజాగా నగరప్రయాణిలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా 600 బస్సులలో ఐ టీమ్స్ అనే ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. బస్సు బయలు దేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకోవడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది.
ఇక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రేవేశ పెట్టాలని లేటెస్ట్ గా టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అన్ని సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సర్వీసుల్లో బస్సు బయలుదేరే గంట ముందే బుకింగ్స్ క్లోజ్ అవుతాయి. కానీ ఐ టీమ్స్ మిషన్ల ద్వారా జర్నీలో 15 నిమిషాల ముందు పాసింజర్స్ కౌంటర్ల వద్ద టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
దీని ద్వారా ప్రయాణికులకు దూర ప్రయాణాలు మరింత సులభతరమవుతాయి. అయితే ఐ టీమ్స్ మిషన్ల ద్వారా టికెట్ బుకింగ్ కోసం యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే వెలుసు బాటు కూడా అందుబాటులో ఉండనుంది.