తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ నడుస్తోంది. అభివృద్ధిలో కాదు.ప్రజలపై భారం మోపడంలో..ఛార్జీల వడ్డనలో. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు భారీగా పెరగడంతో సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది.అది చాలదన్నట్టు ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరిగాయి.
డీజీల్ సెస్ పేరుతో చార్జీల వడ్డనకు దిగింది తెలంగాణలో ఆర్టీసీ.పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచింది.ఎక్స్ ప్రెస్,డీలక్స్, మెట్రో డీలక్స్ సూపర్ లగ్జరీకి రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక బస్ సర్వీసులో కనీస ధరను రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు.
ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులకు చుక్కలు కనపడుతున్నాయి. దీనికితోడు విద్యుత్ చార్జీల పెంపు అదనపు భారం. మళ్లీ ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచారు.