కేంద్రం సడలింపులు, జోన్ల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కావటంతో… ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని మంగళవారం నుండి మొదలుపెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కంటైన్మెంట్ జోన్లు మినహా బస్సులన్నీ 50శాతం ఆక్యుపెన్సీతో నడపాలని తెలంగాణ సర్కార్, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గ్రామాలు, జిల్లాల్లో పూర్తిస్థాయిలో బస్సులు రోడ్డెక్కనుండగా.. జీహెచ్ఎంసీలో దశల వారీగా బస్సులు తిరగబోతున్నాయి.
అయితే, కరీంనగర్, అదిలాబాద్, సిద్దిపేట వైపు నుండి వచ్చే బస్సులను జేబీఎస్ కే పరిమితం అవుతాయి. వరంగల్ వైపు నుండి వచ్చే వాహానాలు ఉప్పల్ రింగ్ వరకు, నల్గొండ వైపు నుండి వచ్చే బస్సులు ఎల్.బీ నగర్ వరకు అనుమతిస్తారు. మహబూబ్ నగర్ నుండి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు అవకాశం ఉంటుంది.
కేవలం తెలంగాణ వరకే బస్సులు తిరగబోతున్నాయి. తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు బస్సులు అనుమతించే అవకాశం లేదు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇక థర్మల్ స్ర్కీనింగ్ తప్పనిసరి చేయటంతో పాటు మాస్క్ తప్పనిసరి ఉంటేనే అవకాశం కల్పించబోతున్నారు. ఇక ప్రతి బస్సులో శానిటైజర్ కంపల్సరీ చేయబోతున్నారు.