టీఎస్ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ..సంస్థ అభివృద్ధికి వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. నష్టాల బాటలో ఉన్న సంస్థను గాడిన పెట్టి అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వినియోగదారులకు వాటర్ బాటిళ్లను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్ తో పాటు డిజైన్ సూచించాలని ప్రయాణికులను సజ్జనార్ కోరారు.
ఎవరైతే బెస్ట్ డిజైన్, టైటిల్ పంపుతారో వారికి బహుమతి కూడా ఇస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు సజ్జనార్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వినియోగదారుల కోసం 500 ఎంఎల్, ఒక లీటర్ వాటర్ బాటిళ్లను త్వరలో ప్రారంభిస్తున్నామని, వాటర్ బాటిల్ కు డిజైన్ తో పాటు టైటిల్ సూచించాలని కోరారు.
ఉత్తమ టైటిల్, డిజైన్ సూచించిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. సూచనలను వాట్సాప్ నెంబర్ 94409 70000 నెంబర్ కు పంపాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పోస్టర్స్ రిలీజ్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.