ఇంచార్జ్ ఎండీతో నెట్టుకొస్తున్న తెలంగాణ ఆర్టీసీకి కొత్త బాస్ రాబోతున్నారు. పూర్తి స్థాయి ఎండీని నియమించండని కోర్టు మొట్టికాయలు వేయటంతో… కొత్త బాస్ ఎవరైతే బాగుటుందన్న వేటలో పడింది ప్రభుత్వం. ముగ్గురి పేర్లను ఇప్పటికే సీఎంవో పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఐపిఎస్ ఆఫీసరే ఎండీగా ఉండటం అనవాయితీగా వస్తోన్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరు అన్న ఉత్కంఠ ఆర్టీసీలోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ కొనసాగుతోంది.
అయితే ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్ర వైపు మొగ్గుచూపుతోన్నట్లు తెలుస్తోంది. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా వెళ్లేందుకు కేసీఆర్ అంగీకరించినా, అప్పగించాలని జగన్ కోరినా… కేంద్రం నో చెప్పటంతో ఆగిపోవాల్సి వచ్చింది. పైగా ఉద్యమాలపై కఠినంగా ఉంటారన్న పేరు కూడా ఉన్న నేపథ్యంలో స్టీఫెన్‌వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు కనపడుతోంది.
ఇక స్టీఫెన్ రవీంద్రతో పాటు పౌరసరఫరాల కమీషనర్ అకున్ సభర్వాల్, ఐపిఎస్ ప్రవీణ్‌కుమార్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో సీఎం ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాలి.