మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉధృతరూపం దాల్చింది. ఆర్టీసీ కార్మికులంతా ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నారు.
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటున్నారు. సర్కారు వైఖరిపై మండిపడుతున్నారు. కేసీఆర్ సర్కారుకు పతనం దగ్గర పడిందని ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. వీరి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ డిపో, బస్టాండ్ ముందు పోలీస్ బలగాలు భారీగా మోహరించి వున్నాయి. 60 బస్ సర్వీసులు నిలిచిపోయాయి.