తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. నడిరోడ్డుపై రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సు టైర్లు ఊడిన ఘటన మరవకముందే వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో మరో ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో సూపర్ లగ్జరీ బస్సు దగ్ధమైంది. కళ్లముందే మంటల్లో కాలి పోయింది. అదృష్టవశాత్తూ ప్రయాణీకులంతా ముందే దిగిపోవటంతో ప్రాణనష్టం తప్పింది.
ప్రగతి రథ చక్రాలుగా పేరున్న ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నా… ఆర్టీసీ అధికారుల తీరు మారటం లేదు. డ్రైవర్ల అప్రమత్తతో ప్రమాదాల నుండి బయటపడుతున్నా… రాత్రి వేళల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రయాణికులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారని జనం మండిపడుతున్నారు.