ఆర్టీసీ జేఏసీతో నామ మాత్రపు చర్చలకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా… చర్చల ప్రక్రియను మొదలుపెట్టింది ఆర్టీసీ యాజమాన్యం. రెండు గంటలకు యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వనిస్తూ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఓవైపు ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం కేసీఆర్… విలీనం జరగదని, 1000శాతం అసాధ్యమంటూనే… సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారంటూనే ఇప్పుడు చర్చలకు పిలవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. ముందే ఓ నిర్ణయం తీసుకొని, కేవలం కోర్టు ఆదేశాల మేరకు నామమాత్రపు చర్చలు జరుపుతున్నారని, ఇది ఎవరిని మభ్యపట్టేందుకు అని ప్రశ్నిస్తున్నాయి.
అయితే, ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు 21అంశాలను మాత్రమే పరిశీలించబోతుంది యాజమాన్యం. వీలీనం అనే పదమే చర్చల్లో లేకపోవటంతో… చర్చలు విఫలం అవుతాయని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.