టీటీడీ మరో నిర్వాకాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ బయట పెట్టింది. టీటీడీ ఈఓకు మరో అన్యమత పాపాన్ని ఫిర్యాదు చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్లో ఆర్షజ్యోతి పేరుతో ఉన్న పుస్తకంలో బైబిల్ అండ్ ఖురానిక్ వెర్సెస్ సంవాదాన్ని పేర్కొనడం జరిగింది. హిందూ ఏతర రచనలపై రమణ మహర్షి అభిప్రాయాలను పొందుపరిచారని ఫిర్యాదులో పేర్కొన్న అంశాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ట్వీట్ చేయడంతో నెటిజన్లు భారీగా స్పందించారు. టీటీడీ నిర్వాకంపై మండిపడ్డారు.
ఏపీ క్రైస్తవ ప్రభుత్వం నుంచి టీటీడీకి విముక్తి ప్రసాదించాలని ప్రధాని మోదీ, ఇతర బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఒకరు ట్వీట్ చేశారు. ఆలయాల్లో రిజర్వేషన్లు వర్తింపజేస్తున్న ఏపీ ప్రభుత్వం మసీదులు, చర్చీల్లో ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హిందూయిజాన్ని నాశనం చేయడానికి పూనుకుందా ? అంటూ మరో ట్వీట్. అమిత్ షా గారు హిందూయిజాన్ని రక్షించాలని మరో ట్వీట్. హిందువులు ఒక వైపు కులం, మరో వైపు లౌకిక తత్వం ముసుగులో ఉన్నన్ని రోజులు ఇలాంటివి చూస్తూనే ఉంటామని మరో ట్వీట్.
హిందువుల మనోభావాలతో చెలగాట మాడుతున్న అధికారులు, పాలకులు ఉన్నంత కాలం ఇలా అన్యమత పెత్తనాలు టీటీడీలో సాగుతూనే ఉంటాయి. ఆలయం, ప్రభుత్వం వేరుగా ఉంటేనే హిందూయిజానికి మేలు. అప్పటిదాకా తప్పదు ఈ అన్యమత కీడు.