వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు షాక్ ఇచ్చింది. ఎంపీ విజయసాయితో పాటు తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులపై గతంలో టీటీడీ వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకోవటం లేదని టీటీడీ ప్రకటించింది.
గతంలో విజయసాయి, రమణదీక్షితులు తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ 2018లో టీటీడీ కేసు వేసింది. తాజాగా ఆ కేసును ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వెనక్కి తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పందించిన టీటీడీ… కేసును కొనసాగిస్తామని తెలిపింది. వారిపై ఉన్న పరువు నష్టం కేసును కొనసాగిస్తామని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి వద్ద టీటీడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది.