తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులకు బోర్డు షాకివ్వనుంది. టీడీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాయితీపై బోజనం అందిస్తూ వస్తోంది. సోమ, గురువారాల్లో 6 రూపాయలకు, మిగతా రోజుల్లో 5 రూపాయలకు బోజనం అందిస్తోంది టీటీడీ. అయితే రాయితీతో కూడిన బోజనంపై రాయితీని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. పెరిగిన బోజన ధరలపై సర్కూలర్ జారీ అయినట్లు తెలుస్తోంది.
5 రూపాయలకు అందించే బోజనాన్ని 23కు, 6 రూపాయల బోజనాన్ని 26 రూయాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక వీటితో పాటు మిగతా వంటకాలపై కూడా భారీగానే బాదటంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సామాన్యులకు పెంచిన రేటుతో లడ్డూలను విక్రయిస్తోన్న టీటీడీ… ఉద్యోగులకు ఇస్తోన్న 5రూపాయల సబ్సిడీని కూడా ఎత్తివేసి 25రూపాయలకు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీడీలో పనిచేసే ఉద్యోగుల కోసం తిరుపతిలోని పరిపాలన భవనం వద్ద ఎస్వీ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటి నుండి అమలులో ఉన్న ఈ సబ్సిడీని కొనసాగించాలని టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.