చిత్తూరు జిల్లాకు టీటీడీ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వరకు భర్తీ చేయబోయే పోస్టుల్లో ఇక నుండి చిత్తూరు జిల్లా స్థానికత ఉన్న వారికి 75శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో చిత్తూరు జిల్లా నిరుద్యోగ యువతకు అరుదైన సదవకాశం దక్కినట్లయింది. అయితే, ఈ నిర్ణయంతో ఇతర జిల్లాల నిరుద్యోగ యువతకు పోటీ తీవ్రతరం కాబోతుంది.