విజయవాడ : టీటీటీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ని కలిశారు. ఈ భేటీలో టీటీడీ పాలక మండలికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లీకైన వివరాలు ఇలావున్నాయి.
25 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి.
గతంలో 19 మందిగా ఉన్న పాలక మండలి సభ్యులను 25కు పెంచిన ప్రభుత్వం .
సాయంత్రంలోగా అధికారిక ఉత్తర్వులు వెలువరించనున్న ప్రభుత్వం.
సభ్యులుగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
ఎస్సీ కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్.
స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి , తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్..
మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు.
మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి..
సభ్యులుగా సుబ్బారావు, కృష్ణ మూర్తి…
కేంద్ర మంత్రులు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు టీటీడీ బోర్డు సభ్యులుగా పలువురి పేర్లను సిఫార్సు చేసినట్టు సమాచారం.