టీటీడీ పాలకమండలి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ లను జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. పాలకమండలి తీసుకున్న నిర్ణయంతో ఏటా టీటీడీకి వడ్డి రూపేణా సుమారు 100 కోట్ల మేర నష్టం కలుగనుంది. ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసే వెసులుబాటును ప్రక్కన ఇక నుంచి పక్కన పెట్టాలని పాలకమండలి నిర్ణయించుకుంది.
ప్రైవేట్ బ్యాంకులో 8.6 శాతంతో వస్తున్న వడ్డీని కాదని…. జాతీయ బ్యాంకులో ఇస్తున్న 6.57 శాతం వడ్డీకి సిద్ధం అయ్యింది. పాలకమండలి ఆదేశాలతో 1400 కోట్ల రూపాయల డిఫాజిట్లును సిండికేట్ బ్యాంక్ లో అధికారులు డిపాజిట్ చేశారు. ఇప్పటికే టీటీడీ డిపాజిట్లను వద్దని ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్ చెప్పడంతో వడ్డీ ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో ఏర్పడిన లోటు బడ్జెట్ ను ఎలా భర్తీ చెయ్యాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు టీటీడీ అధికారులు.