తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా వృద్ధులు, చిన్న పిల్లలకు దర్శనం కల్పించటం లేదు. కానీ ఇక నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గర్శకాల మేరకు 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు పిల్లలు నిబంధనలు పాటించి స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది.
చిన్న పిల్లల కేశ ఖండన, చెవిపోగులు కుట్టడం, అన్నప్రాసన, షష్టి పూర్తి చేసుకొనేవారు, 70–80 ఏళ్ల శాంతి చేసుకొనే వారు చాలా మంది ఉంటారు. దీంతో ఇప్పుడు వీరికి స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నారు. అయితే, వీరంతా ముందస్తుగా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, గతంలో మాదిరిగా ఎలాంటి ప్రత్యేక క్యూలైన్లు ఉండవని టీటీడీ ప్రకటించింది.
ఇక భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది. రోజుకు దాదాపు 20 వేల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది.