తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి ప్రధాన అర్చకులు కాబోతున్నారు. తొలివెలుగు ముందే చెప్పినట్లు… ఏపీ ప్రభుత్వం జారీ చేసిన వంశపారంపర్యపు హక్కులను కొనసాగించే జీవోను టీటీడీ కూడా అమలు చేయబోతుంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయం కూడా తీసుకుంది.
టీడీపీ ప్రభుత్వంలో వంశపారంపర్యంగా కొనసాగించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో రమణదీక్షితులు నేరుగా ప్రభుత్వంపై, చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. టీటీడీ తాజా నిర్ణయంతో రమణదీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుని హోదాలో తిరిగి నియమకం కాబోతున్నారు.