కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. దేశవ్యాప్తంగా వేళల్లో కేసులు నమోదు అవుతున్న వేళ కరోనా మహమ్మారి బారిన పడి శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు శ్రీనివాసాచార్యులు మృతి చెందారు. గత నాలుగు రోజుల ముందు కరోనా తో తిరుపతి స్విమ్స్ లో చేరిన అర్చకులు శ్రీనివాసాచార్యులు
పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు.తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం నుండి డిప్యుటేషన్ పై శ్రీవారి ఆలయం కి శ్రీనివాసచార్యులు ఇటీవల వచ్చారు. శ్రీనివాసచార్యులు మృతిని అధికారికంగా టిటిడి మాత్రం ధృవీకరించలేదు.