తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు పేర్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన అగరుబత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకరానుంది. టీడీడీలో ఉపయోగించిన పూలతో ఈ అగరబత్తులు తయారు చేయబోతున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఏడుకొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లతో అగరుబత్తులు తయారు చేయిస్తున్నారు. అభయహస్త, తందదాన, ఆకృష్టి, దివ్యపాద, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అందుబాటులోకి రానున్నాయి. లడ్డూ కౌంటర్ల వద్ద ఇవి అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. వీటి తయారీ కోసం వైఎస్సార్ ఉద్యాన వర్సిటీతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది.