• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » పక్షి తెచ్చిన ప్రమాదం…!

పక్షి తెచ్చిన ప్రమాదం…!

Last Updated: December 9, 2022 at 8:21 am

ప్రమాదం ఎవరికి ఎలా పొంచి ఉంటుందో తెలియదు ! ఈ భూమ్మీద మనకు నూకలు ఉంటే ఏ ప్రమాదం నుంచైనా బతికిబట్టకడతాం. చెల్లిపోతే అనంత లోకాలకు వెళ్ళిపోతాం. పాపం ఆ రైల్వే ఉద్యోగి ప్రమాదం అంచులకు చేరుకుని ప్రాణాలతో బైటపడ్డాడు. విషయం ఏంటో తెలిస్తే మీరూ షాకవుతారు.
అదేంటంటే గూడు కోసం ఒక పక్షి తీసుకెళ్తున్న పొడవైన వైర్‌, రైల్వే స్టేషన్‌లోని హైవోల్టేజీ విద్యుత్‌ లైన్‌కు తగిలింది. ప్లాట్‌ఫామ్‌ అంచున నిల్చొని ఉన్న ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి ఆ వైర్‌ రెండో కొన తాకింది. దీంతో ఆ టీటీఈ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్‌ఫామ్‌ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కన పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు.
అయితే అదృష్టవశాత్తూ ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పింది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఆ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ అంచున నిల్చొన్న టీటీఈ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక విద్యుత్‌ వైర్‌ ఆయనకు తగిలింది. దీంతో ఆయన విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ప్లాట్‌ఫామ్‌ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కగా వెనక్కి పడ్డాడు.

A freak accident – a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment – at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF

— Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022

కాగా, ఆ సమయంలో ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉన్న కొందరు ఈ సంఘటన చూసి భయాందోళన చెందారు. తొలుత ఏం జరిగిందో అన్నది ఎవరికీ అర్థం కాలేదు. తేరుకున్న తర్వాత స్పందించారు. విద్యుదాఘాతానికి గురై రైల్వే ట్రాక్‌ వద్ద తలకిందులుగా పడిన టీటీఈని లేపి ఫ్లామ్‌ఫామ్‌పైకి తెచ్చారు. ఆ వెంటనే స్ట్రెచ్చర్‌పై పడుకోపెట్టి ఆసుపత్రికి తరలించారు.
మొత్తానికి ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. విద్యుదాఘాతం వల్ల ఆయనకు కాలిన గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కాగా, ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Primary Sidebar

తాజా వార్తలు

ఇద్దరు అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటామని కోర్టుకెక్కారు..!

సుప్రీంకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు

హైదరాబాద్ కి ముంచుకొస్తున్న హై టెంపరేచర్…!

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేసీఆర్‭ కు చివరి ఎన్నికలు ఇవే..!

కేటీఆర్ అబద్దాలను కూడా వినసొంపుగా చెప్పారు!

ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు!

ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు

గట్టు బాగు చేయడానికి పెట్టిన నిప్పు… ముప్పుతెచ్చింది.!

ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..!

తుంగతుర్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా!

ఫిల్మ్ నగర్

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap