ఏపీలో పీఆర్సీ రగడ పీక్స్ కు చేరింది. ఉద్యోగులు కదం తొక్కారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంతో ఆ పరిసరాల్లో టెన్షన్ నెలకొంది. దీనికి పోలీసులు అనుమతించకపోవడమే కారణం. అయితే ఉద్యోగులు మాత్రం వందల్లో తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఛలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అప్రజాస్వామికం, నియంతృత్వం అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోందన్న తులసిరెడ్డి.. జగన్ ప్రభుత్వం ఉద్యోగస్తులను నమ్మించి మోసగించిందని ఆరోపించారు.
కాంగ్రెస్ డిమాండ్స్
1. పీఆర్సీ జీఓలను ఉపసంహరించుకోవాలి
2. సీపీఎస్ రద్దు చేయాలి
3. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
4. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పనికి సమాన వేతనం కల్పించాలి
5. ఫిట్ మెంట్ 30 శాతం ఇవ్వాలి
6. సీసీఏ గతంలో ఉన్న మాదిరి ఇవ్వాలి
7. హెచ్ఆర్ఏ గతంలో ఉన్న మాదిరి ఇవ్వాలి
8. విశ్రాంత ఉద్యోగులకు అదనపు క్వాంటమ్(పింఛన్) గతంలో మాదిరి ఇవ్వాలి
9. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
10. పీఆర్సీ జీఓలను రద్దు చేసిన తర్వాతనే ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలి