డాక్టర్ ఎన్. తులసీ రెడ్డి
ఏపిసిసి మీడియా చైర్మన్
ఖమ్మం బిఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం పిట్టల దొర ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చింది. అమ్మకు అన్నం పెట్టని ప్రభుద్దుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అనంట్లుంది కేసీఆర్ వాలకం.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని కేసీఆర్ దేశ సమస్యలను పరిష్కరిస్తామనడం హాస్యాస్పదం.గత 75 సంవత్సరాలలో దేశంలో అభివృద్ది జరగలేదనడం అవివేకం.
వ్యవసాయిక, పారిశ్రామిక, సమాచార, ఎలక్ట్రానిక్, రవాణా, విద్యా, వైద్యా, అంతరిక్ష రంగాలలో అద్భుతమైన ప్రగతి జరిగింది. నెహ్రూ, శాస్త్రి, ఇందిరమ్మ, రాజీవ్, పీవీ, మన్మోహన్ సింగ్ లాంటి కాంగ్రెస్ రాజనీతిజ్ఞులు, ప్రగతిశీలురు ఇందుకు కారణం
బీఆర్ఎస్…బీజేపీ తోక పార్టీ. బీఆర్ఎస్ మరో ఏంఐఎం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ముక్త తెలంగాణ తధ్యం. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ సమితి)కాక తప్పదు.