తులసిరెడ్డి.. ఏపీ కాంగ్రెస్ నేత
సీఎం జగన్ మంత్రివర్గ కూర్పు ఒక ప్రహసనం. ఏపీలో మంత్రులు ఉత్సవ విగ్రహాలు. విధులు, నిధులు, అధికారాలులేని మంత్రి పదవులు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. మూడు నెలలు సాము గారిడిలు చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టుంది మంత్రి వర్గ విస్తరణ. ఎంత మంది మంత్రులున్నా.. ఏపీలో చివరికి ఒంటెద్దు పాలనే సాగుతుంది.
11 మంది పాత వారితో, 14 మంది కొత్త వారితో ఏర్పాటు చేసేందుకు ఇంత తతంగం అవసరమా..? పాత మంత్రుల్లో 13మందిని ఎందుకు తొలగించినట్లు..? అసమర్థులా..? అవినీతి పరులా..? ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ జరిపిన మంత్రి వర్గ విస్తరణ రానున్న ఎన్నికల్లో ఓటమికి ఇప్పటి నుండే దారులు వేస్తుంది.
ఎన్టీఆర్, విశాఖ, గుంటూరు, అల్లూరి, ఏలూరు, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య ఈ ఎనిమిది జిల్లాలకు ప్రాతి నిధ్యం లేదు. ఇదేనా అధికార వికేంద్రీకరణ..? ఈ ఎనిమిది జిల్లాల వైసీపీ ఎమ్మెల్యే లు అసమర్థులా..?. అసలు ఏ కారణాలతో వారిని మంత్రి పదవుల నుండి తొలగించారో చెప్పాలి. నచ్చినప్పుడు నియమించి.. నచ్చనప్పుడు వదిలేయడానికి వారు నీ జీతగాళ్లు కాదు. మంత్రులని గుర్తుంచుకో. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులని మరిచిపోకు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, వెలమ, తెలగ, బలిజ, ఒంటరి.. ఈ సామాజిక వర్గాలకు ప్రాతి నిద్యం లేకుండాపోయింది. ఇదేనా సామాజిక న్యాయం..? ఇప్పటికే రాష్ట్రంలో అసమ్మతి ప్రారంభమయింది. సీఎం దిష్టి బొమ్మలు కాల్చే స్థితికి చేరుకుంది. ఈ అసమ్మతి వాయుగుండం త్వరలో తీరం దాటి సునామిగా మారకతప్పదు. ఆ సునామి విరుచుకుపడితే జగన్ అందులో కొట్టుకుపోక తప్పదు.