పంటి నొప్పికని పోతే.. తొంటి మీద తన్నినట్టుంది జగన్ పాలనా విధానం అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. జిల్లాలను విడగొట్టి వికేంద్రికరణ పేరుతో రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
13 జిల్లాలను విడగొట్టి 26 జిల్లాలుగా మార్చి.. ఇదే అభివృద్ధి అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 73,74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. గ్రామ పంచాయితీలు, స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయిస్తే.. అది నిజమైన పాలనావికేంద్రికరణ అవుతోందని అన్నారు తులసిరెడ్డి.
గాలేరు నగరి, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి.. ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాలో పరిశ్రమలు సాధిస్తే అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని జగన్ తెలుసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవి చేయకుండా 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తా అభివృద్ధిని ప్రగతి పథంలో నడిపిస్తానని డబ్బాలు కొట్టుకుంటుంటే హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ప16 అయినా.. 26 అయినా.. 175 అయినా.. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ప్రయోజనం ఉండదని ప్రజలు గుర్తించాలని అన్నారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకేనేందుకు కుట్రలు రాజేస్తున్నారు జగన్ అని విమర్శించారు తులసిరెడ్డి.