270 కిలోల బరువు గల చేప. ఎనిమిదిన్నర అడుగుల పొడవు. పైగా అది మామూలు చేప కాదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ట్యూనా చేప. వలలో పడిన ఈ ట్యూనా చేప మార్కెట్‌లో 23 కోట్ల రూపాయిలు పైనే వుంటుంది. ఇంత ఖరీదు వున చేప చిక్కితే ఎవరైనా ఏం చేస్తారు? ఎంచక్కా అమ్మేసి సెటిలైపోతారు. ఐర్లాండ్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్స్ ఏం చేశాడో తెలుసా? పట్టిన చేపని పట్టినట్టే మళ్లీ నీళ్లలో వదిలేశాడు. ఏదో సరదా కోసమే చేపలు పడుతున్నామని, వాటిని అమ్మడం నా ప్రొఫెషన్ కాదని పెద్ద స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. నివాసం వుండాలనుకున్నంటున్న ప్రాంతంలో ఎలాంటి చేపలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఇలా చేపలను పట్టి తరువాత వదిలేస్తున్నామని డేవ్ చెప్పుకొచ్చాడు.