7 గురిని సురక్షితంగా కాపాడిన అధికారులు మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కట్నిజిల్లాలో బార్గీ ప్రాజెక్ట్ కెనాల్ కోసం నిర్మిస్తున్న సొరంగం కుప్పకూలిపోయింది. దీంతో ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తు్న్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సహాయక చర్యలను అందించేందుకు ఎస్డీఆర్ ఎఫ్ దళాలను అధికారులు రంగంలోకి దించారు. సొరంగంలో సుమారు 9 మంది కార్మికులు చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 7గురు కార్మికులను రక్షించి బయటకు తీసుకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్ర ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జబల్ పూర్ నుంచి పిలిపించినట్టు తెలిపారు. ఘటనపై
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఘటన వివరాలను కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి సహాయక చర్యల గురించి వివరాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(హోమ్) రాజేశ్ రాజోరా ఎప్పటికప్పుడు కలెక్టర్ ను అడిగి తెలుసుకుంటున్నారు.
‘ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ ఎఫ్ దళాలు అధునాతనమైన సాంకెతికను ఉపయోగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు” అని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్ అరోరా చెప్పారు.