టర్కీలో మృతుల సంఖ్య 41వేలకు చేరుకుంది. టర్కీలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. 12రోజుల పాటు శిథిలాల కింద మృత్యువుతో పోరాడి మృత్యుంజెయుడిగా నిలిచాడు.
45 ఏళ్ల హకన్ యాసింగ్లోను సహాయక బృందాలు శిథిలాల కింద నుంచి వెలికి తీసి ఆస్పత్రికి తరలించాయి. ఆయనతో పాటు టీనేజర్ హలేబియే, ముస్తఫా అఫిసీ(34)లను కూడా రెస్క్యూ సిబ్బంది కాపాడాయి. భూకంపానికి కొన్ని గంటల ముందే అఫిసీకి కూతురు పుట్టింది.
డెలివరి కోసం అఫిసి భార్యను వేరే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో వారు భూకంపం నుంచి తప్పించుకోగలిగారు. అయితే దురదృష్టవ శాత్తు అఫిసీ మాత్రం అక్కడే ఉండిపోయాడు. 12రోజుల తర్వాత అతన్ని రెస్క్యూ సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఆస్పత్రిలో అఫిసిని అతని భార్య కలిసింది. కూతుర్ని చూసి అఫిసి సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఇది ఇలా వుంటే 200 ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు టర్కీ ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓకటే తెలిపారు.