టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో మరణించిన మృతుల సంఖ్య ప్రస్తుతం 28000 ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి సహాయ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ అన్నారు. అది రాబోయే రోజుల్లో రెటింపు లేదా అంత కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
టర్కీలో మొదటి భూకంపం సంభవించిన కహ్రామన్మరాస్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం ఇప్పుడు ఇబ్బంది ఉందన్నారు. అందువల్ల మృతుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామన్నారు.
కానీ మృతుల సంఖ్య రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారరం ఇప్పటి వరకు టర్కీలో భూకంప మృతుల సంఖ్య 24,617గా ఉంది. మరో వైపు సిరియాలో మృతుల సంఖ్య 3,574కు చేరుకుంది.
టర్కీ, సిరియాలో కనీసం 8,70,000 మందికి అత్యవసరంగా వేడి భోజనం అవసరమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సిరియాలోనే 5.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఏఎఫ్పీ పేర్కొంది. ఈ భూకంపం వల్ల 26 బిలియన్ల మంది ప్రభావితమైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.