కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు….ఈ విషయాన్ని కుక్కలు అనేక సార్లు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాయి. టర్కీకి చెందిన ఓ కుక్క తన యజమాని హాస్పిటల్ లో ఉన్న… 6 రోజులు ఆసుపత్రి గేట్ వద్ద నిలబడి యజమాని త్వరగా కోలుకోవాలని ఎదురుచూసి వార్తల్లో నిలిచింది.
టర్కీకి చెందిన 68 ఏళ్ల సెమల్ బోన్కుక్ అనే కుక్కను పెంచుకునేవాడు.! సడెన్ గా సెమల్ కు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది… ఇంటినుండే అంబులెన్స్ లో అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఓనర్ ను తీసుకెళ్లడాన్ని చూసిన కుక్క అంబులెన్స్ ను ఫాలో చేసి హాస్పిటల్ కు చేరుకుంది. హాస్పిటల్ వద్ద ఉన్న కుక్కను సెమల్ కుమార్తె ఇంటికి తీసుకొచ్చినప్పటికీ మళ్లీ హాస్పిటల్ కు వెళ్లి…అక్కడి గేట్ వద్ద వెయిట్ చేసేది.6 రోజుల తర్వాత సెమల్ డిచార్జ్ కావడంతో బోన్కుక్ ఆనందంతో గెంతులేసింది!
finaly, they came together. 😊 pic.twitter.com/qP12L3st9M
— the istanbulist (@istanbulism) January 19, 2021