చైనా క్షిపణి నుంచి ప్యాసింజర్ విమానం ఒకటి తృటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ప్రయాణికులతో కూడిన విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా వెళుతోంది. ఆ సమయంలో చైనా సబ్ మెరైన్ లు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
ఈ విషయాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం పైలెట్ ను అలెర్ట్ చేసింది. విమానాన్ని వెంటనే 90 డిగ్రీలో కోణంలో టర్న్ చేయాలని పైలెట్ కు సూచించింది.
ఈ వీడియోలో చైనా సబ్ మెరైన్ నుంచి క్షిపణి ప్రయోగం, దాని నుంచి విమానం తప్పించుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.