ప్రముఖ టీవీ షో ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ లో జాస్మిన్ పాత్రలో నటించి పాపులర్ అయిన నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మరణించారు. హిమాచల్ ప్రదేశ్ లోనిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయస్సు 32 ఏళ్ళు. ఆమె మరణవార్తను ప్రొడ్యూసర్ జేడీ. మజీతియా ధృవీకరించారు.
హిమాచల్ లో వైభవి ప్రయాణిస్తున్న కారు మలుపు తిరుగుతూ ఓ లోయలో పడిపోయినట్టు తెలిసిందన్నారు. ఈ కారులో ఆమె స్నేహితుడు కూడా ఉన్నట్టు తెలిసిందని, అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వెల్లడైందని ఆయన అన్నారు.
జీవితం అన్నది ఏ మాత్రం ఊహకందనిదని, వైభవి మృతి తనను షాక్ కి గురి చేసిందని పేర్కొన్నారు. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ ‘ షోతో బాటు వైష్ణవి ఇంకా… ‘క్యా కసూర్ హై క్యా అమలా కా’, ‘ సిఐడీ’, ‘అదాలత్’ వంటి టీవీ షోల్లోను, ‘ప్లీజ్ ఫైండ్ ఎటాచ్డ్’ అనే డిజిటల్ సీరీస్ లోను నటించింది.
ముఖ్యంగా ఉత్తరాదిలో ప్రసిద్ది చెందిన వైభవి..బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ చిత్రమైన ‘ఛపాక్’ మూవీలోనూ నటించింది. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వైభవి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆమె అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరగనున్నట్టు తెలుస్తోంది. ఆమె మృతికి టీవీ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.