బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి. ప్రేమ వ్యవహారమే శ్రావణి కొంపముంచిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సాయి మరోవైపు దేవరాజు లతో శ్రావణి ప్రేమాయణం నడిపినట్లు చెబుతున్నారు. సాయి తో ప్రేమలో ఉన్న శ్రావణి దేవరాజు పరిచయం తర్వాత అతనిపైకి వెళ్ళింది. దేవరాజు తో పరిచయమైన కొద్ది రోజులకే అతని తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయినట్లు తెలుస్తోంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నా అతని మీద కేసు పెట్టిన దేవరాజు మీద ప్రేమ మాత్రం తగ్గలేదని భావిస్తున్నారు పోలీసులు.
కుటుంబ సభ్యులకు సాయి కి తెలియకుండా దేవారాజును కలిసేదని సమాచారం. ఇంట్లో కుటుంబ సభ్యులు సాయి తో జరిగిన గొడవలు ఇందుకు నిదర్శనం. మరోవైపు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పటికీ ఏమీ తెలియనట్టుగా దేవరాజు కు కాల్ చేసి జరుగుతున్న గొడవ చెప్పింది. కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలలో కూడా దేవరాజు పై ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది. సాయి తనను అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందని తన తల్లిని నిలదీసింది. రెస్టారెంట్ లో తనను సాయి అందరి ముందు కొట్టడం లిఫ్ట్ వద్ద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసింది శ్రావణి. ఇలా గంట గంటకు శ్రావణి కేసు మలుపులు తిరుగుతూ సినిమా కథని తలపిస్తోంది.