ఇతర దేశాల్లో ఏమో గాని మన దేశంలో మాత్రం సినిమా వాళ్ళ జీవితాల మీద జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ప్రతీ అంశంలో కూడా సినిమా వాళ్ళను తీసుకుని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక టీవీ స్క్రీన్ మీద కనపడే సీరియల్ నటులను కూడా వదిలే అవకాశం ఉండదు. మన దేశంలో సీరియల్స్ ని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఆన్ స్క్రీన్ లో ఇద్దరు కలిస్తే… ఆ ఇద్దరు ఎక్కువగా కనపడితే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు.
సాధారణంగా ఒక హీరో హీరోయిన్ కలిసి ఎక్కువ సినిమాల్లో చేస్తే, ఎక్కువ సీరియల్స్ లో చేస్తే వారి పరిచయం ప్రేమగా, పెళ్ళిగా మారుతుంది. టీవీ సీరియల్స్ లో అభిమానులకు బాగా దగ్గరైన జంటలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎవరో చూద్దాం.
నీల్ భట్ మరియు ఐశ్వర్య శర్మ : ‘ఘుమ్ హై కిసికే ప్యార్ మెయిన్’ సీరియల్ చేసే సమయంలో ఇద్దరూ సెట్స్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అందులో వారు ఐపిఎస్ విరాట్ చవాన్ మరియు పాఖీ పాత్రలను పోషిస్తున్నారు. జనవరి 27 న వీరు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
దీపికా కక్కర్ మరియు షోయబ్ ఇబ్రహీం : ‘సాసురల్ సిమార్ కా’లో కలిసి నటించారు. అక్కడి స్నేహం చివరికి ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. తన మాజీ భర్తకు దీపిక 2015 జనవరిలో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించి 2018 లో వివాహం చేసుకున్నారు.
మోహిత్ సెహగల్ మరియు సనయా ఇరానీ : ‘మిలే జబ్ హమ్ తుమ్ ద్వారా ప్రేక్షకులకు వీరు బాగా దగ్గరయ్యారు. వీరు నిజజీవితంలో కూడా కలిసిపోయారు. వీరిద్దరూ 2016 లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు ఏడేళ్ళ నుంచి డేటింగ్ లో ఉన్నారు.
హిటెన్ తేజ్వానీ మరియు గౌరీ ప్రధాన్ : ‘కుతుంబ్’, ‘క్యుంకి సాస్ భీ కబీ బహు థి’ మరియు ‘మేరీ ఆషికి తుమ్ సే హాయ్’ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అభిమానులను తమ నటనతో కెమిస్ట్రీతో ఆకట్టుకున్న ఈ ఇద్దరు 2004 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ 2009 లో నెవాన్ మరియు కాట్యా అనే కవలలు జన్మించారు.
కిష్వర్ మర్చంట్ మరియు సుయ్యాష్ రాయ్ : నటులు ‘ప్యార్ కి యే ఏక్ కహానీ’ సెట్స్‌లో వీరి పరిచయం మొదలయింది. ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ డిసెంబర్, 2016 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి త్వరలో సంతానం కలుగనుంది.
శ్వేతా కవత్ర, మానవ్ గోహిల్ : ఇద్దరూ కలిసి ‘కహానీ ఘర్ ఘర్ కి’లో పనిచేశారు. 4 సంవత్సరాల తరువాత, వీరు 2005 లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012 లో అమ్మాయి పుట్టింది.