టీవీనైన్ వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అరెస్ట్
రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పదిమంది పోలీసులు బృందం
కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు
ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా రవిప్రకాశ్ అరెస్టు..
పెట్టిన కేసులు వేరు… చెబుతున్న కారణాలు వేరు.. చేస్తున్న ప్రచారం వేరు.. ఇంత కుట్రపూరితంగా దేశంలో ఇంతవరకు ఏ ఆరస్టూ ఇలా జరగలేదు. ఓవరాల్‌గా మెఘా కృష్ణారెడ్డి కుంభకోణాలు ఒక్కొక్కటీ బయటపెడుతున్న నేపధ్యంలో సాకులు వెతికి మరీ.. గూడుపుఠాణి చేసి టీవీ 9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్‌ను అరెస్టు చేశారు. దీన్ని కక్ష సాధింపు చర్య అనకుండా ఏమంటారు? తాజాగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కుంభకోణంలో మెగా కృష్ణారెడ్డి ఉన్నారంటూ ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి ఒక ఇంటర్వ్యూలో సంచలన వాఖ్యలు చేశారు. తొలివెలుగు ఆ వీడియాను ప్రసారం చేయగా…ఆ వీడియో వెంటనే ఆపివేయాలంటూ రవిప్రకాశ్‌పై అనేక ఒత్తిళ్లు వచ్చాయి. కానీ ఆ వీడియో డిలీట్ చేయడానికి యాజమాన్యం నిరాకరించటంతో పోలీసులు కారణం చెప్పకుండానే టీవీ 9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. కోర్టుకు బలమైన కారణం చూపించాలి కనుక నిధుల దుర్వినియోగం కేసును తవ్వి తీసినట్టు కనిపిస్తోంది.
ఇటీవల శివాజీ కూడా మెఘా కృష్ణారెడ్డి కుంభకోణాల్ని వారానికి ఒక్కొక్కటి బయట పెడతానంటూ వీడియోలో ఓ సంచలన ప్రకటన చేశారు. మొదటి వీడియోనే అతిపెద్ద స్కామ్‌కు సంబంధించిన అంశంగా స్వయంగా శివాజీయే ప్రకటించాడు. ఓఎన్‌జీసీలో రిగ్గుల కాంట్రాక్టు వెనుక అసలు స్టోరీ చెప్పడానికి శివాజీ ఉద్యుక్తడవుతున్నాడు. ఈ స్కాములన్నీ తవ్వి తీయడం వెనుక రవిప్రకాశ్ వున్నాడనేది మెఘా అనుమానం. అందుకే నేరుగా రవిప్రకాశ్‌ని టార్గెట్ చేసి మేటర్‌ని ఇక్కడితో నిలిపివేయాలనే కుట్ర కోణం ఇందులో కనిపిస్తోంది. నిఖార్సైన జర్నలిజానికి నిలువెత్తు మనిషి రవిప్రకాశ్.. ఈ అరెస్టులు, దొంగ కేసులు అతన్ని ఏమీ చేయలేవని అతని అనుచరులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు అండగా వుంటామని ఫోన్లు చేసి చెబుతున్నారు.
అసలు మెఘా వీడియోలో ఏముందో ఈ వీడియోలో చూడండి