సూర్యాపేటపై కరోనా వైరస్ మరోసారి పంజా విసిరింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో… సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ టౌన్ షిప్ లో ఉంటున్న ఒక్క కుటుంబంలోనే ఏకంగా 22మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ కుటుంబం ఇటీవల అంత్యక్రియలకు హజరయ్యింది. ఆ తర్వాత వారిలో కొద్ది లక్షణాలు కనిపించగా ఇంట్లో ఉన్న 28మందికి టెస్టు చేయగా ఏకంగా 22మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.