తల్లిగర్భంలో ఉన్న కవలలు కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన చైనాలో జరిగింది. 4 నెలల గర్భావతి అయిన తన భార్యను థావో చెకప్ కోసం ఇనుచ్ ఆన్ హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. అల్ట్రా సౌండ్ లో కడుపులోని ఇద్దరు కవలలు ఒకరిని ఒకరు గుద్దుకుంటున్నట్టుగా కనిపించింది.అల్ట్రా సౌండ్ లో కనిపిస్తున్న దృశ్యాలను తండ్రి థావో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
2.5 మిలియన్స్ వ్యూస్ దాటిన ఈ వీడియో కింద అదే సంఖ్యలో కామెంట్లు కూడా పెట్టారు నెటీజన్లు.! కడుపులోని పిల్లలు కొట్టుకోవడం చూసి మొదట తండ్రి కాస్త ఆందోళన చెందినప్పటికీ ఇది సాధారణ విషయమే అని డాక్టర్ చెప్పడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు.
ప్రస్తుతం:
ఈ కవలలు జన్మించారు. థావో వారికి చెర్రీ, స్ట్రాబెర్రీ అనే నిక్ నేమ్స్ పెట్టుకున్నాడు. కడుపులో ఉన్నప్పుడు కొట్టుకున్న ఆ పిల్లలు ఇప్పుడు మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటున్నారు.