ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ అధికారిక ట్విట్టర్ ఖాతా శనివారం హ్యాక్ అయింది. ఆయన ఫ్రొఫైల్ పిక్చర్ స్థానంలో ఒక కార్టూన్ ను హ్యాకర్లు పెట్టారు. ఆ ఖాతా నుంచి పెద్ద ఎత్తున్న హ్యాకర్లు ట్వీట్లు చేసినట్టు తెలుస్తోంది.
సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతాను 40.53 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ ఖాతా దాదాపు సుమారు అరగంటకు పైగా హ్యాకర్ల చేతుల్లో ఉండిపోయింది. సుమారు 300లకు పైగా ట్వీట్లను హ్యాకర్లు చేసినట్లు తెలుస్తోంది.
శనివారం ఉదయం 12.43 గంటలకు ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. దీంతో అధికారులు వెంటనే స్పందించి దాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
ఉదయం 1.20 గంటల ప్రాంతంలో సీఎం ట్విట్టర్ అకౌంట్ ను అధికారులు తిరిగి పునరుద్ధరించారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారులు స్పందించకపోవడం గమనార్హం.