అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ తన సందేశాల ద్వారా హింసను ప్రోత్సహించే ఆస్కారముందని ట్విట్టర్ అభిప్రాయపడింది. ట్విట్టర్ వేదికగా ఇటీవల ఆయన ఇచ్చిన సందేశాలను విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడి ఖాతాను ట్విట్టర్ ఏకంగా నిషేధించటం సంచలనమే. అయితే, నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్ ఘన విజయం సాధించారు. కానీ ట్రంప్ మాత్రం అధికారాన్ని బదిలీ చేసేందుకు ఒప్పుకోవటం లేదు. పైగా తన వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రకటనలిస్తుండటంతో… ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది.
మొదట 12గంటల పాటు ట్విట్టర్ ఖాతాను నిషేధించిన ట్విట్టర్, ఇప్పుడు శాశ్వతంగా తన ఖాతాను నిషేధించింది.