సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పై రాజకీయా ప్రకటనలను నిషేదిస్తున్నామని ఈ నిషేధం నవంబరు 22 నుంచి అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15న వెల్లడిస్తామని ట్విటర్ సీఈవో తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలతో పాటు , రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామర్నారు.
రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప కొనకూడదు” అని ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ట్వీట్ చేశారు. నవంబర్ 22 వ తేదీ నుంచి అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు.