ట్విట్టర్ కొత్త బాసు ఎలన్ మస్క్ మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీలో భారీ సంఖ్యలో ఉద్యోగులను మస్క్ తొలగిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

దీనిపై మరో 10 రోజుల్లోగా తుది నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలుపడాల్సి వుంది. మస్క్ చేతికి వెళ్లాక ట్విట్టర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ట్విట్టర్ ఆఫీసులకు కనీసం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని కాఫీ మిషన్లు, నియాన్ లోగో, ఇతర సామగ్రిని కూడా వేలానికి పెట్టారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో తెలుస్తోంది. వీటిని హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ సంస్థ 27 గంటల ఆన్‌లైన్ వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 631 సర్‌ప్లస్ కార్పొరేట్ ఆఫీస్ ఆస్తులను పెట్టారు.