తండ్రి మందలించాడని ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. స్కూల్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బ్రిజేష్ కుమార్, ప్రిన్స్ కుమార్ అనే 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. ప్రిన్స్ కుమార్ అనే విద్యార్థి ఇంట్లో ఉన్న అల్మారాలో రూ.17,500 నగదు తీసుకొని వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జవహర్ నగర్ పోలీసులు. అయితే ఇద్దరు విద్యార్థులు బస్సులో సికింద్రాబాద్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
అనంతరం సికింద్రాబాద్ పోలీసులకు విద్యార్థులు గురించి వివరాలు పంపించారు జవహర్ నగర్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.